gadagoni pavan avatar

‘మహేశ్ కత్తిని నిన్నే చూశా... ఆయనకు పొట్ట, బట్ట లేదు’

gadagonipavan

Published: 16 Nov 2017 › Updated: 16 Nov 2017‘మహేశ్ కత్తిని నిన్నే చూశా... ఆయనకు పొట్ట, బట్ట లేదు’

‘మహేశ్ కత్తిని నిన్నే చూశా... ఆయనకు పొట్ట, బట్ట లేదు’

జబర్దస్త్ షోలో హైపర్ ఆది పంచ్‌లు తనను ఉద్దేశించిన వేసినవేనంటూ మహేశ్ కత్తి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే బుధవారం హైదరాబాద్‌లో లండన్ బాబులు సినిమా ప్రివ్యూ సందర్భంగా హైపర్ ఆదితో కలిసి దిగిన ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన మహేశ్, పవన్ ఫ్యాన్స్‌కు చురకలంటించారు. తాజాగా హైపర్ దీనిపై స్పందించారు. కత్తి మహేశ్ ఎవరో తనకు తెలియదని, నిన్ననే లండన్ బాబులు సినిమా ప్రివ్యూ సందర్భంగా చూశానని ఆది తెలిపాడు. ఒక టీవీ ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో ఆది మాట్లాడుతూ, కత్తి మహేశ్‌కు పొట్ట, బట్ట రెండూ లేవని అన్నాడు.

తాను ఆయనను దృష్టిలో ఉంచుకుని పంచ్ డైలాగులు వేయలేదని, తమ ఊర్లో ఉన్న సుత్తి రాజేష్ గురించి వ్యాఖ్యానించానని తెలియజేశాడు. సుత్తి రాజేష్ ఇంటింంటికీ తిరుగుతూ పని చేసుకుని బతుకుతాడని, ఫేస్‌బుక్ లో ఏది పడితే అది అంటాడని పేర్కొన్నాడు. తన వీడియోలు కోటి మంది చూస్తారని, కత్తి మహేశ్ రివ్యూలు లక్ష మంది చూస్తారని అన్నాడు. కత్తి మహేశ్ తనను తాను సెలబ్రటీ అనుకుంటున్నాడని ఎద్దేవా చేశాడు. పవన్ కల్యాణ్‌ను విమర్శించే స్థాయి ఆయనకు లేదని వ్యాఖ్యానించాడు. తన ఫోటో పెట్టి ఫ్యాన్స్‌కు 'మేము మేము ఇలా కలిసిపోతాం..మధ్యలో వెధవలయ్యేది మీరేనని వ్యాఖ్యానించాడని, తాము అభిమానులను అలా అనమని అన్నాడు. స్క్రిప్టు రాయాలంటే చాలా కష్టమని, అంత కష్టపడి సినిమా తీస్తే అది బాగాలేదనడానికి కత్తి మహేశ్ ఎవరని ఆది ప్రశ్నించాడు.

‘సినిమాలు తీయడం కష్టం. రివ్యూలు రాయడం ఏముంది. ముందు పొట్ట, వెనుక బట్ట ఉంటే చాలంటూ’ జబర్దస్త్ షోలో హైపర్ ఆది పేల్చిన పంచ్‌లు తనను విమర్శించేలా ఉండటం పట్ల కత్తి మహేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఫేస్‌బుక్ లైవ్ ద్వారా ఆదిపై, జబర్దస్త్ షో‌పై కత్తి మహేశ్ విమర్శలు గుప్పించాడు. అలాగే దీనిపై ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జబర్దస్త్ షోతోపాటు పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పించారు.
-.jpg

Leave ‘మహేశ్ కత్తిని నిన్నే చూశా... ఆయనకు పొట్ట, బట్ట లేదు’ to:

Written by

Hi This is Gadagon Pavan

Read more #pawankalyan posts


Best Posts From gadagoni pavan

We have not curated any of gadagonipavan's posts yet. But you can encourage our curation team to review posts by visiting them regularly and by referring other readers. Because we give priority to frequently read content.

More Posts From gadagoni pavan